శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించారు. మే 6న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని రెండు లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ వస్తున్నదని, వైవిధ్యమైన కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమా ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. రామచంద్రరాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ రగుతు, రచన: శ్రీకాంత్ విస్సా, సమర్పణ: సాయి కొర్రపాటి, దర్శకత్వం: చైతన్య దంతులూరి.