Sree Vishnu Swag Third Single Out | ‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్’ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న హీరో శ్రీ విష్ణు మరో కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటిస్తుంది.
ఈ సినిమాను దసరా కానుకగా.. అక్టోబర్ 04న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి థర్డ్ సింగిల్ నీలో నాలో(Neelo Naalo) అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. భువన చంద్ర రాసిన ఈ పాటను రాజేష్ కృష్ణన్ & అంజనా సౌమ్య పాడగా.. వివేక్ సాగర్ సంగీతం అందించాడు. హృదయాన్ని హత్తుకునేలా ఎమోషనల్‌గా ఉన్న ఈ పాటను మీరు వినేయండి.
దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.