Single Movie | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన తాజా కామెడీ చిత్రం ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘సింగిల్’ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4.15 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు ఏకంగా రూ.7.05 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం మొత్తం రూ.11.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ కలెక్షన్లు శ్రీ విష్ణు కెరీర్లోనే అత్యధికంగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా థియేటర్లు నిండుగా ఉండటంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
అమెరికాలో కూడా ఈ చిత్రం రెండు రోజుల్లో $300k మార్క్‌ను దాటేసింది. వీకెండ్ ముగిసే నాటికి అర మిలియన్ డాలర్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘బుక్ మై షో’ ప్రకారం, విడుదలైన 24 గంటల్లోనే 80 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇదే జోరు కొనసాగితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ మరియు ఇతర నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. వెన్నెల కిశోర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. కామెడీ సన్నివేశాలు, శ్రీ విష్ణు మరియు వెన్నెల కిశోర్‌ల మధ్య సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరిస్తున్నారు.
#Single is breaking records and providing laughs all over! ❤️🔥
Smashing the $300K+ mark in USA🔥.
A massive day at the box office!🇺🇸We are adding extra shows continusuly around the clock…Book your tickets now 🎫
Grand USA release by @VcinemasUS @sreevishnuoffl @GeethaArts… pic.twitter.com/rfWLAwphBF
— V Cinemas (@VcinemasUS) May 11, 2025