Arjuna Phalguna Teaser | ‘అయినా బలైపోవడానికి అభిమన్యుడిని కాదు ‘ శ్రీ విష్ణు మాస్ టీజర్
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ శ్రీ విష్ణు (Sree Vishnu) ఒకడు. ఈ యువ హీరో నటిస్తోన్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ (Arjuna Phalguna). ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

కథను నమ్ముకుని సినిమా తీసే హీరోల్లో టాలీవుడ్ (Tollywood) యాక్టర్ శ్రీ విష్ణు (Sree Vishnu) ఒకడు. ఈ యువ హీరో నటిస్తోన్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ (Arjuna Phalguna). తేజ మర్ని (Teja Marni) దర్శకత్వం వహిస్తున్నాడు. అమృతా అయ్యర్ (Amritha Aiyer0 హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు. అర్జునుడిని’ అని శ్రీ విష్ణు చెప్పే డైలాగ్స్ తో టీజర్ మొదలైంది.
హాయ్‌గా ఎంజాయ్ చేస్తున్న శ్రీ విష్ణు, స్నేహితులు ఓ సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్యలో నుంచి శ్రీ విష్ణు అండ్ టీం ఎలా బయటపడ్డారనే సీరియస్ కథాంశంతో సాగుతున్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. అంతేకాదు టీజర్లో హీరోయిన్ అమృతా అయ్యర్, శ్రీ విష్ణు రొమాంటిక్ ట్రాక్ కూడా బాగుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ టీజర్‌కు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ భారీ నిర్మాణ విలువలు, శ్రీ విష్ణు యాక్షన్ పార్టు సినిమా హిట్టు కొట్టేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. అర్జున ఫల్గుణ చిత్ర విడుదలపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

