Sree Leela | పెళ్లి సందD సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల (Sree Leela). ఈ డెట్రాయిట్ భామకు డెబ్యూ సినిమా అంతగా కలిసి రాకున్నా.. తన యాక్టింగ్‌తో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఉందంటే శ్రీలీల ఎంత ప్రొఫెషనల్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న ఈ భామ ఖాతాలో ప్రస్తుతం ఏకంగా ఎనిమిది సినిమాలున్నాయి. ఇప్పుడు శ్రీలీలకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే శ్రీలీల తన డేట్స్‌ను గంటల పద్దతిలో కేటాయిస్తుందట.
శ్రీలీల మార్నింగ్ సెషన్లో షూటింగ్ కు హాజరయ్యాక.. లంఛ్ తర్వాత మరో సినిమా షూటింగ్‌కు వెళ్లేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుందట. ఈ లెక్కన శ్రీలీల రౌండ్ ది క్లాక్ పని చేస్తూ తీరిక లేకుండా ఉందని తెలిసిపోతుంది. ఇప్పటికే శ్రీలీల నటిస్తోన్న సినిమాల్లో మూడు సెట్స్ పై ఉన్నాయి. మహేశ్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28), పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సెట్స్‌పైకి వెళ్లాయి. మరోవైపు వైష్ణవ్ తేజ్ సినిమాతోపాటు నితిన్ 32, అనగనగా ఒక రాజు, జూనియర్ సినిమాల్లో నటిస్తోంది శ్రీలీల. ఇవే కాకుండా బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బీకే 108లో కూడా నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
అయితే లీడింగ్ హీరోయిన్గా స్టార్ డమ్ సంపాదించాల్సిన శ్రీలీల.. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా సైన్ చేయడం సరికాదని, కెరీర్లో నిలిచిపోయే సినిమాలకు సైన్ చేస్తే బాగుంటుందని కొందరు ఫాలోవర్లు సూచిస్తున్నారు. 2019లో Kiss సినిమాతో కన్నడ సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి మెరిసింది శ్రీలీల. ఇండస్ట్రీకి వచ్చిన కేవలం నాలుగు సంవత్సరాల్లోనే తీరిక లేకుండా ఉన్న శ్రీలీలను చూసి.. ఏంటి అప్పుడే మరీ ఇంత బిజీనా అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.