SR కళ్యాణమండపం కలెక్షన్స్.. కడప కుర్రాడు కుమ్మేస్తున్నాడుగా..!
SR కళ్యాణమండపం కలెక్షన్స్ | SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్‌గా ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. ఐదు రోజుల్లోనే చాలా చోట్ల ఈ సినిమా లాభాల్లోకి వచ్చేసింది. మరి 5 డేస్ కలెక్షన్స్ ఎంతో ఓ సారి చూద్దామా..

SR Kalyanamandapam Collections | కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా రోజులుగా థియేటర్లలో సినిమాలు విడుదల చేయలేదు. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించేశారు. ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో థియేటర్స్‌లోకి వచ్చిన ఓ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. ట్రేడ్‌ను కూడా ఆశ్చర్యపరుస్తూ ఖతర్నాక్ కలెక్షన్లను తీసుకొస్తుంది. అదే కిరణ్ అబ్బవరం నటించిన SR కళ్యాణమండపం. ఈ సినిమా సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఐదు రోజుల కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కూడా కిరణ్ అబ్బవరమే. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన SR కళ్యాణమండపం సినిమాకు రొటీన్‌గా ఉందనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.. ఇంకా చెప్పాలంటే భారీగానే వచ్చాయి. ఐదు రోజుల్లోనే చాలా చోట్ల ఈ సినిమా లాభాల్లోకి వచ్చేసింది. మరి 5 డేస్ కలెక్షన్స్ ఎంతో ఓ సారి చూద్దామా..

నైజాం: 2.13 కోట్లు
సీడెడ్: 1.11 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.65 కోట్లు
ఈస్ట్: 0.35 కోట్లు
వెస్ట్: 0.26 కోట్లు
గుంటూరు: 0.50 కోట్లు
కృష్ణా: 0.25 కోట్లు
నెల్లూరు: 0.14 కోట్లు
ఏపీ + తెలంగాణ: 5.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.48 కోట్లు
వరల్డ్ వైడ్: 5.86 కోట్లు
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ 4.55 కోట్లకు అమ్మారు. కొత్త హీరోకు ఇంత బిజినెస్ వర్కవుట్ కాదని చాలా మంది విమర్శించారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ వైపు కూడా ప్రేక్షకులు రారు అంటూ డిసప్పాయింట్ చేశారు. కానీ మూడు రోజుల్లోనే నైజాం సహా చాలా ఏరియాల్లో SR కళ్యాణమండపం సినిమా లాభాల్లోకి వచ్చేసింది. వీక్ డేస్ లోనూ మంచి వసూళ్లను తీసుకురావడం శుభసూచకం. మొత్తానికి సెకండ్ వేవ్ తర్వాత మొదటి విజయంగా చరిత్ర సృష్టించింది SR కళ్యాణమండపం చిత్రం. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలు కూడా థియేటర్స్ లో విడుదల కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రజినీకాంత్ చిన్నపిల్లోడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నితిన్ హీరోయిన్
సెప్టెంబర్‌లో సినిమాల జాతర..క్యూలైన్ లో ఉన్న సినిమాలివే..!
వైరల్‌గా మారిన యషికా హాస్పిటల్ పిక్.. !
ఈ శుక్రవారం థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాలేంటో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

