వైరల్గా మారిన యషికా హాస్పిటల్ పిక్.. !

తమిళ సినీ నటి, బిగ్ బాస్ ఫేం యాషిక్ ఆనంద్ కొద్ది రోజుల క్రితం మహాబలేశ్వరం దగ్గర జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో స్నేహితురాలు భవానీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. యషికాతో పాటు మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నయషికా ఇప్పుడు కాస్త కోలుకున్నట్టు తెలుస్తుంది.
ఆమెను రీసెంట్గా జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయగా,ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. అయితే తాను తన ఇంటికి వెళ్లకుండా తన స్నేహితురాలైన ఓ నర్సు ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటోంది. ఇంటికి వెళితే భవానీ జ్ఞాపకాలే గుర్తుకొస్తాయని అందుకే తెలిసిన నర్సు ఇంటికి వెళ్లానని అంటుంది. అక్కడ చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకుంటుందట యషికా. అయితే ర్యాష్ డ్రైవింగ్ చేసిన యషికాపై చెంగల్పట్టు జిల్లా కానత్తూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఆమె డ్రైవింగ్ లైసెన్సును కూడా స్వాధీనం చేసుకున్నారు.
రీసెంట్గా యషికా తన సోషల్ మీడియాలో భవాని మృతిని తలచుకొని బాధపడింది. నేను కూడా చనిపోయుంటే బాగుండేదని.. ఇప్పుడు బతికున్నా కూడా సంతోషంగా లేనంటూ ఎమోషనల్ అయింది. భవాని.. నువ్వు జీవితంలో నన్ను క్షమించవని తెలుసు.. వీలైతే మళ్లీ మా మధ్యకు రా అంటూ ఏడ్చేస్తుంది యషికా. దేవుడు తనను బతికించినందుకు సంతోషపడాలో.. తన స్నేహితురాలిని తీసుకెళ్లినందుకు బాధ పడాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది యషికా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

