4 సినిమాలు లైన్లో పెట్టిన కుర్ర హీరో
కిరణ్ అబ్బవరం | విడుదలైంది ఒక్క సినిమా మాత్రమే. అది కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండో సినిమా విడుదలకు సిద్ధమైంది. అప్పుడే ఆ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

విడుదలైంది ఒక్క సినిమా మాత్రమే. అది కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండో సినిమా విడుదలకు సిద్ధమైంది. అప్పుడే ఆ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ ఉందా.. వారసుడా అంటే అదీ కాదు. చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాలపై ప్యాషన్‌తో వచ్చాడు. వచ్చీ రాగానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు. ఆ హీరో పేరు కిరణ్ అబ్బవరం. ఈ పేరు పరిచయం కావడానికి కాస్త టైమ్ పడుతుందేమో..? కానీ గుర్తు పెట్టుకోడానికి మాత్రం ఎక్కువ టైమ్ పట్టేలా లేదు. ‘రాజావారు రాణిగారు’తో హీరోగా పరిచయం అయిన కిరణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

రెండో ప్రయత్నంగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేశాడు కిరణ్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నాడు ఈ కుర్ర హీరో. సాఫ్ట్వేర్ నుంచి సినిమాపై ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చారు ఈయన. తెలుగు ప్రేక్షకులు తనను చాలా బాగా ఆదరిస్తున్నారని తెలిపాడు కిరణ్. తొలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. రెండో సినిమా కోసం గ్యాప్ తీసుకున్నాడు. ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి పాత్రలు చేయాలనేది తన డ్రీమ్ అంటున్నాడు కిరణ్ అబ్బవరం. జూలై 15న ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.

‘SR కళ్యాణమండపం’ సినిమా గ్లింప్స్ జూలై14న విడుదల కానుంది. అలాగే ‘ సెబాస్టియన్ ’ సినిమా పోస్టర్ జూలై 14 సాయంత్రం 5.30 నిమిషాలకు విడుదల కానుంది. జూలై 15 ఉదయం 10.05 నిమిషాలకు ‘ సమ్మతమే ’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు కిరణ్ అబ్బవరం 5వ సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది. ఈ మేరకు తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కిరణ్ అబ్బవరం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి ఒక్క సినిమా అనుభవంతోనే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రెండు నెలలుగా ఐసీయూలోనే హీరోయిన్ తనయుడు
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
ప్రశాంత్ నీల్.. నాలుగు నెలల్లో రెండు పాన్ ఇండియన్ సినిమాలు
ఇండస్ట్రీలోకి కోడిరామకృష్ణ కూతురు ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

