Squid Game S3 | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ మళ్లీ వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి రెండు సీజన్లు రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఫస్ట్ సీజన్ అయితే రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. గతేడాది 2వ సీజన్ రాగా.. ఇది కూడా రికార్డు వ్యూస్‌ను అందుకుంది. అయితే ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది గ్రాండ్ ఫినాలేతో రాబోతుంది. తాజాగా 3వ సీజన్ టీజర్‌తో పాటు మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 27 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు టీమ్ తెలిపింది.