Spy Movie Release Date | ఈ మధ్య కథల ఎంపిక విషయంలో నిఖిల్‌ను కొట్టేవారు లేరు అన్నట్లు వ్యవహరం సాగుతుంది. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ.. ప్రేక్షకులను సరికొత్త కథలతో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా పలు జానర్లను టచ్ చేస్తూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఇక కార్తికేయతో ఏకండా పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన మార్కెట్ కూడా భారీ స్థాయిలోనే ఉంది. ఓటీటీ సంస్థలు సైతం పోటీ పడి మరీ నిఖిల్ సినిమాలను కొనుక్కుంటున్నాయి. ఇక ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో స్పై ఒకటి.
సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తాడు. 1945లో ప్లయిన్ క్రాష్ లో అంతర్ధానమైన సుభాష్ చంద్ర బోస్ మిస్టరీ మరణం చుట్టూ గ్యారీ ఈ స్పై కథను రాసుకున్నట్లు టీజర్‌తో స్పష్టమైంది. నిజానికి ఇలాంటి మిస్టరీ స్టోరీలకు ఇప్పుడు తెగ క్రేజ్ ఉంది. తవ్వకాల్లో బయట పడే నిధుల గురించి ఏ మేర ఆసక్తి ఉందో.. ఇలా మరుగున పడిపోయిన, జనాలకు తెలియని కథలను సినిమా రూపంలో తెరకెక్కించి ఆదే ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే సినిమా రేంజే పెరిగిపోతుంది.
ఇలాంటి కథలను కాస్త ఎంగేజింగ్‌గా, ప్రేక్షకులను లాజిక్‌లతో కట్టిపడేస్తే చాలు నిర్మాతలకు కాసుల వర్షం కురవడం ఖాయం. ఇప్టపికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి హైపే తీసుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే గతంలోనే ఈ సినిమాను జూన్ 29న దింపుతున్నట్లు ఓ పోస్టర్‌ను ప్రకటించారు. అయితే ఆదిపురుష్ ట్రైలర్, పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూసి సైలెంట్ అయిపోయారు. ఆదిపురుష్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ ఎఫెక్ట్ రెండు మూడు వారలు ఖచ్చితంగా ఉంటుంది. దాంతో స్పై సినిమాను రిలీజ్ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో చిత్రబృందం పడింది.
అయితే ఆదిపురుష్‌కు మిక్స్డ్ టాక్ రావడంతో స్పై సినిమా ప్రొడ్యూసర్ జూన్ 29న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను దింపుతున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు రెండు వారాలు కూడా లేదు. ఇప్పటికిప్పుడు సినిమాపై హైప్ రావాలంటే తీరిక లేకుండా ప్రమోషన్లు గ్రటా చేయాలి. పైగా పాన్ ఇండియా లెవల్లో అంటే నార్త్‌లోనూ కాస్త గట్టిగానే ప్రమోషన్లు జరపాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో నిఖిల్ అసంతృప్తిగా ఉన్నాడా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిఖిల్ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు. మొన్నామధ్యన వచ్చిన లిరికల్ సాంగ్‌ను, ఆదివారం వచ్చిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను రెంటింటిని సోషల్ మీడియాలో వెల్లడించలేదు.
దాంతో నిఖిల్ ఈ సినిమా విషయంలో అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరిచారు. కాగా మరో మూడు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది.