ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ చిత్రం ఈ నెలలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న చిత్రమిదే కావడంతో పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. నిజాయతీ కలిగిన పోలీస్ అధికారి కథ ఇదని, ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించబోతున్నామని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనేక సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
ఇది కేవలం పోలీస్ కథాంశం మాత్రమే కాదని, ఇందులో డార్క్ సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని వార్తలొస్తున్నాయి. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా.. హెయిర్‌ైస్టెల్, డ్రెస్సింగ్ మొదలుకొని ప్రతీ అంశంలో ప్రభాస్‌ను వినూత్న పంథాలో ఆవిష్కరించేందుకు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ పోలీస్ పాత్ర కోసం ప్రభాస్ బరువు బాగా తగ్గి స్లిమ్‌గా కనిపించబోతున్నారట. ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తయిందని, మరికొద్ది రోజుల్లో ‘స్పిరిట్’ సెట్స్ మీదకు వెళ్తుందని తెలిసింది.