Spirit | టాలీవుడ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటి ‘స్పిరిట్’ చిత్రం ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన సందీప్ ఇప్పుడు ప్రభాస్‌ను ఏ రీతిలో చూపించబోతున్నాడు? అనేది అభిమానుల్లోనే కాదు, మొత్తం సినీ వర్గాల్లోనూ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. సమాచారం ప్రకారం, చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ నెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా త్రిప్తి దిమ్రి నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక కొరియన్ నటుడు డాన్ లీ కూడా ఈ కథలో భాగమవుతున్నట్టు సమాచారం. సందీప్ సినిమాల్లో ప్రతినాయక పాత్రలకు ఎప్పటిలాగే ఈసారి కూడా భారీ ప్రాధాన్యం ఉండబోతుందని టాక్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో హాట్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, దగ్గుబాటి కుటుంబానికి చెందిన హీరో అభిరామ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. తన పాత్రకు యారోగెన్సీ, ఓవర్ యాటిట్యూడ్, పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. అందుకు అనుగుణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా అభిరామ్‌ను అప్రోచ్ చేశారని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్, రానా ఇప్పటికే విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తుండగా, అభిరామ్ మాత్రం తన మొదటి చిత్రం ‘అహింస’ (దర్శకుడు తేజ)తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ సినిమా విడుదలైపోయిందనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవడం ఆయన కెరీర్ స్తబ్దతకు కారణమైంది. ఇలాంటి సమయంలో ‘స్పిరిట్’ లాంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కితే అది ఆయన కెరీర్లో గేమ్‌చేంజర్ అవుతుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సందీప్ వంగా సినిమాల్లో హీరో పాత్రల మాస్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, యాంటగనిస్ట్ పవర్ అన్నీ కలగలిపి ఉంటాయి. అందుకే ‘స్పిరిట్’లో ప్రభాస్‌ను కొత్త షేడ్‌లో చూడబోతున్నామనే టాక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అభిరామ్ రోల్ నిజమైతే, ఆ పాత్ర కూడా సినిమాలో ప్రధాన హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది.