Spirit | డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు అరడజను సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే వీటన్నింటిలో కూడా అందరిలో ఆసక్తి పెంచుతున్న చిత్రం స్పిరిట్. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు కానీ.. స్పిరిట్ గురించి ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి. గతేడాది రిలీజైన కల్కీ అరివీర భయంకర హిట్టు కొట్టడంతో.. ప్రభాస్ తర్వాత సినిమాలపై ఓ రేంజ్లో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’ చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయ్యాక నాగ్ అశ్విన్ తో కల్కి – 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం
స్పిరిట్ చిత్రాన్ని సందీప్ ఏ జానర్లో తెరకెక్కిస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్గా దీపిక పదుకొణేని ఎంపిక చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీపికా కండీషన్స్ తట్టుకోలేక ఆమె స్థానంలో యానిమల్ హీరోయిన్ని ఎంపిక చేశాడు సందీప్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటించనున్నట్లు సందీప్ శనివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌కు హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి అఫీషియల్‌గా ఒక అనౌన్స్మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు.
స్పిరిట్ అనేది ఇప్పుడు మనకు సింపుల్ వర్డ్లా అనిపిస్తుంది కానీ.. ఒక్క సారి సినిమా స్టార్ట్ అయ్యాక టైటిల్‌కు జస్టిఫికేషన్ అనిపిస్తుందని సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వూలో చెప్పాడం చూశాం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా సందీప్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాని దాదాపు 9 భాషల్లో తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తుంది. తాజాగా చిత్రంలో కథానాయిక త్రిప్తి డిమ్రీ అని అనౌన్స్ చేస్తూ ఆమె పేరును తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ రాశారు. అంటే ఈ సినిమాని ఆ భాషలన్నింటిలో విడుదల చేయనున్నారు.ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లడం ఖాయం.