Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ (OG) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన “హంగ్రీ చీతా” గ్లింప్స్, మాస్ లిరికల్ సాంగ్‌తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ సినిమా రూపొందుతోందని టాక్. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న, అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న OG నుంచి స్టైలిష్ యాక్షన్‌తో కూడిన వీడియో సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు.
గతేడాది బర్త్‌డే సందర్భంగా వచ్చిన “హంగ్రీ చీతా” గ్లింప్స్ ఎంతగా హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈసారి దానికి మించిన విజువల్స్‌తో, తమన్ కంపోజ్ చేసిన మాస్ మ్యూజిక్‌తో పవన్ బర్త్‌డే స్పెషల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో OG టీమ్ ముందుకు వెళుతుంది. ఈ వీడియో సాంగ్‌లో పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ యాక్షన్ సీన్లు, కొన్ని క్రేజీ గ్లింప్స్‌తోపాటు సినిమా కథపై ఓ మిస్టరీ టచ్ కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. ఫ్యాన్స్‌కి ఇది ఓ డబుల్ ట్రీట్ అవుతుందని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక OG మూవీ షూటింగ్ కూడా తుదిదశకు చేరిందని సమాచారం.
మరో రెండు మూడు రోజుల షూటింగ్‌తో యూనిట్ గుమ్మడికాయ కొట్టనుందని తెలుస్తుంది. బర్త్‌డే రోజున వీడియో సాంగ్‌తో పాటు, సినిమా రిలీజ్‌కు సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ కూడా రానున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు, OGతో పాటు పవన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా బర్త్‌డే స్పెషల్‌గా టీజర్ లేదా పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా రెండు సినిమాల నుండి వస్తున్న బర్త్‌డే ట్రీట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌కి ఈసారి ఫెస్టివల్ ఫీల్ రావొచ్చని అంటున్నారు.