Chiranjeevi | తెలుగు సినిమా ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘మన శంకర వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి, ఈసారి పూర్తి కామెడీ టచ్‌తో, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించబోతున్నారని టాక్.అనిల్ రావిపూడి సిగ్నేచర్ కామెడీ టైమింగ్, చిరంజీవి ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి 2026లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలనేది అనిల్ రావిపూడి ఆలోచనట. కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ పాట సినిమా హైలైట్‌గా నిలుస్తుందని బజ్. ఇటీవల మెగాస్టార్ మాట్లాడుతూ .. “ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి చెప్పిన సన్నివేశాలు విన్నప్పుడు నేనే కడుపుబ్బా నవ్వుకున్నా. ప్రేక్షకులు థియేటర్లలో చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తారు,” అని తెలిపారు. అనిల్ రావిపూడి కూడా తన స్టైల్ కామెడీతో పాటు హృదయాన్ని తాకే ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, క్యాథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో నటించడం సినిమాకి అదనపు బలాన్నిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి, యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ సాధించింది. ఈ సినిమాను సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్ అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్లో ఉంది. నవంబర్ చివరికి షూటింగ్ పూర్తిచేసి, డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.