Special OPS 2 | ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ + హాట్‌స్టార్ (ఇప్పుడు జియో హాట్‌స్టార్)లో వచ్చిన స్పెషల్ ఓపీఎస్ (Special OPS) వెబ్ సిరీస్ నుంచి కొత్త సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీ వాయిదా పడింది. బాలీవుడ్ సీనియర్ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon) ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ సిరీస్‌లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 11 2025 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వారం వాయిదా వేసి జూలై 18న తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని జియో హాట్‌స్టార్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. హిమ్మత్ సింగ్ అనే రా ఏజెంట్ తన దేశంపై జరుగబోతున్న ఉగ్రదాడులను ముందే తెలుసుకోని వాటిని ఆపడానికి ఒక స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు చేస్తాడు. ఇక ఈ టీమ్ చేసే విన్యాసాలు ఏంటి అనేది వెబ్ సిరీస్ స్టోరీ. అయితే తాజాగా రాబోతున్న కొత్త సీజన్.. సైబర్ టెర్రరిజం చుట్టూ తిరుగుతుందని స్పష్టం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంటే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) అధికారి హిమ్మత్ సింగ్ (కేకే మీనన్) తన బృందంతో కలిసి ఈ డిజిటల్ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటాడు అన్నది కథ.
ఈ సీజన్లో తాహిర్ రాజ్ భాసిన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. కరణ్ టాకర్, వినయ్ పాఠక్, దిలీప్ తాహిల్, ప్రకాష్ రాజ్, పర్మీత్ సేథి, కాళి ప్రసాద్ ముఖర్జీ, ముజామిల్ ఇబ్రహీం, సైయామీ ఖేర్, గౌతమి కపూర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.
Himmat and his squad are ready and it’s going to be worth all the wait!!#HotstarSpecials #SpecialOps2, all episodes streaming from July 18, only on #JioHotstar @neerajpofficial @kaykaymenon02 @prakashraaj @pathakvinay @karantacker #TahirRajBhasin @SaiyamiKher #MuzamilIbrahim… pic.twitter.com/HjIF9mnOzQ
— JioHotstar (@JioHotstar) July 8, 2025