స్పందన పల్లి, యుగ్రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్మృతిసాగి, శ్రీనివాస నాయుడు నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
తెలుగు తెరపై తొలిసారి వస్తున్న కంప్లీట్ ఇంటరాగేటివ్ మూవీ ఇది. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికుమార్ దార, సంగీతం: శరవణ వాసుదేవన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ గన్ని.