Sruthi Haasan First Crush | విశ్వనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శృతి హిందీలో తొలి సినిమా చేసింది. మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ‘లక్’ సినిమాతో హీరోయిన్గా తెరంగ్రేటం చేసింది. దీని తర్వాత ఆనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. తొలి సినిమా డిజాస్టర్ ఫలితం సాధించినా.. శృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 7th సెన్స్, ఓ మె ఫ్రెండ్, గబ్బర్ సింగ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్ల జాబితాలో నిలిచింది.
సినిమాల్లోనే కాదు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ హాట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రూస్లీ తనకు తొలి క్రష్ అని శృతి చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు శాంతనుతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది.
ఇక ఈ ఏడాది సంక్రాంతితో రెండు వరుస విజయాలను వెనకేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. దీనితో పాటుగా ది ఐ అనే హాలీవుడ్ సినిమా కూడా చేస్తుంది.