1 నేనొక్కడినే చిత్రంలో లండన్ బాబు.. లండన్ బాబు అంటూ స్పెషల్ సాంగ్‌లో చిందులేసిన సోఫీ చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, యాంకర్‌గా, డ్యాన్సర్‌గా అదరగొడుతూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8లోను సందడి చేసి అశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే పెద్దగా సినిమాల్లో అవకాశాలు రానప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా మాత్రం తన అందాలతో హీటెక్కిస్తుంది సోఫీ. తాజాగా లోదుస్తుల్లో.. అందాల విందు ఇస్తూ కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ.
మాల్దీవుల్లోఈ ముద్దుగుమ్మ బికినీలోఅందాలు ఆరబోస్తూ కేక పెట్టిస్తుంది. సోఫీని ఇలా చూసిన అబ్బాయిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనేలా సోఫీ అందచందాల ప్రదర్శన ఉంది. సోఫి చౌదరీ ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మాల్దీవుల్లోనే గడుపుతోంది. బోట్ రెయిడ్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. సముద్రంలో డాల్ఫిన్లను ఛేజ్ చేస్తూ కాలం గడిపేస్తోంది.
సోఫీ.. ఎంటీవీలో లవ్‌లైన్, జలక్ దిక్లా జా 7 లాంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా చేసింది. ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మనీ హై తో హనీ హై, ఆ దేకే జరా, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా లాంటి చిత్రాల్లో ఆమె నటించింది.