కరోనా కష్టకాలంలో దేవుడిలా మారి అందరికి సాయాలు చేస్తున్నరియల్ హీరో సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. సోనూ సూద్ కార్యక్రమాలతో ఉత్తేజం పొందిన తెలంగాణలోని వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే యువకుడు సోనూసూద్‌ని కలిసేందుకు 700 కి.మీ పాదయాత్ర చేశాడు. రెండు జతలు బ్యాగులో పెట్టుకొని చేతులో సోనూసూద్ ఫొటోతో ఉన్న ప్లక్కార్డు పట్టుకొని ముంబైకి వెళ్లాడు.
‘రియల్ హీరో సోనూ సూద్.. టైటిల్ కింద నా గమ్యం.. నా గెలుపు ట్యాగ్ లైన్ తో..హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర అని రాసిన ప్లకార్డుతో పాదయాత్ర’’ చేశాడు. అష్టకష్టాలు అనుభవిస్తూ ముంబైకి వెళ్లిన వెంకటేష్ తన అభిమాన నటుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంత దూరం ఎందుకు రావడం.. నేనే హైదరాబాద్ కు వస్తుంట కదా.. అంటూ సున్నితంగా వారించాడు సోనూ సూద్. ఏం చేస్తుంటావని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈసారి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలుద్దామంటూ అభిమాని వెంటకేష్ కు హామీ ఇచ్చాడు. దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయోద్దు. దగ్గరలో ఉన్న వారికి చేతనంత సాయం చేయండిఅని సోనూ పేర్కొన్నాడు.