కరోనా సమయం నుండి సోనూసూద్ నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. ఆయన చేస్తున్నమంచి పనులకు కొందరు గుడులు కట్టి పూజలు చేస్తున్నారు.మరి కొందరైతే తమ పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు.సోనూసూద్ ఇటీవల చిరు వ్యాపారులకు అండగా నిలుస్తూ వారి బిజినెస్‌కి సంబంధించి ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది.
సోనూసూద్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన విమానశ్రయంలో చేసిన సాహనం నెటిజన్స్‌ని ఎంతగానో అలరించింది. విమానాశ్రయంలోని ఎస్కలేటర్ పై విన్యాసాలు చేస్తున్న వీడియోను ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో విమానాశ్రయంలోని ఎస్కలేటర్ పై సోనూసూద్ కాళ్లు కింద పెట్టకుండా… చేతులతో ఎస్కరేటర్ వీల్స్ పట్టుకుని గాల్లో తేలుతూ కనిపించారు.
సోనూసూద్ అద్భుతంగా బ్యాలెన్స్ చేయడం పట్ల నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.బ్రిలియన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అంటూ వీడియోని చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనూసూద్.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలానే ఇతర సినిమాలలో కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.