Matka King | వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మట్కా కింగ్’ (Matka King) విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో (Prime Video) ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుండగా.. టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
1960ల నాటి ముంబై నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఒక సాధారణ కాటన్ ట్రేడర్.. అప్పట్లో ముంబైని షేక్ చేసిన ‘మట్కా’ సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడు, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ రూపొందింది. ఇందులో విజయ్ వర్మ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ‘సైరాట్’ సినిమా డైరెక్టర్ నాగరాజ్ మంజులే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.