Sonu Nigam | పద్మశ్రీ అవార్డుపై స్పందించిన సోనూ నిగమ్.. తన అవార్డును ఎవరికి అంకితం ఇచ్చాడంటే?
Sonu Nigam | కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులకు కూడా పద్మ అవార్డులు లభించాయి. అందులో ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కూడా ఉన్నాడు. తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై సోనూ నిగమ్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే.. తనకు వచ్చిన ఈ అవార్డును చనిపోయిన తన తల్లి సోభా నిగమ్‌కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు.

నాకు, నా ఫ్యామిలీకి జనవరి 25 చాలా స్పెషల్ డే. నన్ను పద్మశ్రీ అవార్డుకు సెలెక్ట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరును ఈ అవార్డు కోసం సూచించిన వాళ్లకు కూడా ధన్యవాదాలు. అలాగే నా తల్లి శోభా నిగమ్, నా తండ్రి ఆగమ్ కుమార్ నిగమ్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవార్డును నా తల్లికి అంకితం ఇస్తున్నాను. తను ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఒక వేళ తను ఉండి ఉంటే.. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు వెక్కి వెక్కి ఏడ్చేది. ఆనందాన్ని తట్టుకోలేక తను ఏడ్చి ఉండేది.. అని సోనూ చెప్పుకొచ్చాడు.
సోనూ ఇప్పటి వరకు కొన్ని వందల పాటలు పాడాడు. హిందీతో పాటు కన్నడ, ఒడియా, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మరాఠీ, నేపాలీ, మళయాలం, భోజ్‌పూరీలో ఆయన పాటలు పాడాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

