మరి కొద్ది రోజులలో జరగున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ,సీవీఎల్ నరసింహారావు పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ అయితే తన ప్యానెల్‌ని కూడా పరిచయం చేశాడు. అయితే ప్రతి సారి అధ్యక్ష పోటీకి ఇద్దరు మాత్రమే బరిలో నిలిచే వారు. కాని ఈ సారి ఐదుగురు పోటీ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తించింది.
అయితే రియల్ హీరో సోనూసూద్ కూడా మా అధ్యక్ష బరిలో నిలవనున్నాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కొందరు ఆయనను మా ఎన్నికల బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, సోనూసూద్ కూడా ఇందుకు కొంత ఆసక్తి చూపిస్తున్నాడనే ప్రచారం అయితే నడుస్తుంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, సోనూసూద్ గతంలో ఎన్నికలో పోటీ చేయనంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.