లాక్డౌన్ సమయంలో ప్రజలందరు దిక్కుతోచని స్థితిలో ఉండగా, వారికి ఆపద్భాందవుడిలా కనిపించాడు సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని కాదు ఇప్పటికీ సోనూసూద్ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన సాయం పొందిన వారు సోనూని దేవుడిగా కొలుస్తూ గుడులు కట్టి పూజలు చేస్తున్నారు.
ఈ మధ్య ఆచార్య సినిమాలో నటించిన సోనూసూద్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.అలానే రీసెంట్గా ‘సాత్ క్యా నిభావోగే’ పాటలో కనిపించారు. ఈ పాటకు ప్రముఖ డైరెక్టర్ ఫరాఖాన్ దర్శకత్వం వహించారు. తొంభైలలో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్న ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ పాటకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ నెల 9న విడుదల చేసిన ఈ పాటలో సోనూ, నిధి అగర్వాల్ ఎంతగా రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సాంగ్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు.అయితే ఈ సాంగ్ కోసం ఎంత కష్ట పడ్డారో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు సోనూసూద్. ఇస్మార్ట్ బ్యూటీని ట్రాలీలో కూర్చొపెట్టుకొని ముందుకు తీసుకెళుతున్న సోనూసూద్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇదేదో ఫన్నీగా చేసిన అందరు మాత్రం బాగానే కనెక్ట్ అయ్యారు. ‘ఓ బ్లాక్ బ్లస్టర్ సాంగ్ తీయాలంటే ఎంతో కష్టపడాలి’ అంటూ క్యాప్షన్ జోడించాడు సోనూ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.