Nagarjuna| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. ఎన్టీఆర్,నాని మొదటి రెండు ఎపిసోడ్స్‌కి హోస్ట్‌గా ఉండగా, ఆ తర్వాత నాగార్జుననే షోని నడిపిస్తూ వస్తున్నారు. అయితే కొందరికి నాగార్జున హోస్టింగ్ అంటే ఇష్టం, మరి కొందరికి మాత్రం అస్సలు ఇష్టం ఉండడం లేదు. ఆ కోవలోనే చేరింది ఆర్జీవీ కాంపౌండ్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సోనియా ఆకుల. ఈ అమ్మడు పలు సినిమలలో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా వచ్చి నాలుగు వారాలకే బయటకు వచ్చేసింది.
హౌజ్‌లో ఉన్నన్ని రోజులు అందరి దృష్టి తనవైపుకి తిప్పుకుంది సోనియా. అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్‌ని యష్‌ని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగానే ఉంది. మరోవైపు నటిగానే కాకుండా ఓ టూరిజం సంస్థలో పనిచేస్తుంది, ఓ ఎన్జీవో కూడా నడిపిస్తుంది. సోనియా కీలక పాత్రలో నటించిన ఆర్టిస్ట్ సినిమా మార్చ్ 21న రిలీజ్ కానుండగా,ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి, బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు పర్సనల్ గా బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్లాలని అయితే లేదు. 20 సినిమాలు చేసిన రాని గుర్తింపు నాకు బిగ్ బాస్ షోతో వచ్చింది.
అయితే ఈ సారి బిగ్ బాస్ షోకి నాగార్జున సర్ హోస్ట్ గా ఉండొద్దు అనుకుంటున్నా. నాగ్ సర్ సాఫ్ట్ గా ఉంటారు. నాగ్ సర్ సరిగా మాట్లాడలేదు, చాలా పదాలు, మాటలు మార్చేశారు. నేను అనని వాటి గురించి కూడా తప్పుగా ప్రమోట్ చేసారు. బిగ్ బాస్ లో హోస్ట్ మేజర్ పాత్ర పోషించడం జరుగుతుంది. హోస్ట్ అనే వారు ఉన్నవి లేనివి కలిపి చెప్పకూడదు. నాగార్జున గారి చెవిలో ఉండే మైక్‌లో అవతలి వారు ఏం చెబితే ఆయన అది మాట్లాడతారు. ఏమి ఆలోచించరు. నాగార్జున గారు తప్పుకొని రానా గారు హోస్ట్‌గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. నాగార్జున గారు హోస్ట్ ఉంటే నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే నేను అయితే బిగ్ బాస్ షోకి వెళ్లను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సోనియా.