నకుల్, శ్వేత జంటగా నటిస్తున్న చిత్రం ‘నువ్వంటే నేనని’. సానా క్రియేషన్స్ పతాకంపై సానా యాదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నమ్మవే చెలి నిన్ను నేను ప్రేమిస్తున్నానే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు హరీష్‌శంకర్ సోమవారం విడుదలచేశారు. ఈ సందర్భంగా సానా యాదిరెడ్డి మాట్లాడుతూ ‘2004లో హైదరాబాద్‌లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రమిది. సిధ్‌శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం: వరికుప్పల యాదగిరి.