అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకుడు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలోని ‘రాంబాయి నీ మీద నాకు..’ అనే పాటను మంచు మనోజ్-భూమా మౌనిక దంపతులు విడుదల చేశారు.
ప్రేమలో ఉండే ప్రతీ అమ్మాయిఅబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలా ఈ పాట రాశానని గీత రచయిత మిట్టపల్లి సురేందర్ తెలిపారు. రాజు, రాంబాయి ప్రేమలో సంతోషం, దుఃఖం రెండూ ఉన్నాయని, గతించిన చరిత్రకు..ప్రస్తుత చరిత్రకు ఈ సినిమా సాక్ష్యంగా నిలుస్తుందని నిర్మాత వేణు ఊడుగుల అన్నారు. ఈ పాటలాగే సినిమా కూడా బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.