Sonarika bhadoria | తెలుగు, హిందీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటి సోనారికా భడోరియా ప్రస్తుతం జీవితంలోని అత్యంత మధురమైన దశను ఆస్వాదిస్తోంది. బుల్లితెరపై ‘దేవోన్ కే దేవ్… మహాదేవ్’ సీరియల్లో ‘పార్వతి’ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు తన మొదటి బిడ్డ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. 2024 ఫిబ్రవరి 18న రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో సోనారికా, తన ప్రేమికుడు వికాస్ పరాశర్ ను వివాహం చేసుకుంది. జిమ్‌లో పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లింది. ఇండస్ట్రీకి బయట వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని ఇంతకుముందే చెప్పిన సోనారికా, ఆ మాటను నిజం చేసింది.
సెప్టెంబర్‌లో గర్భధారణ విషయాన్ని ప్రకటించిన ఈ దంపతులు, తాజాగా మేటర్నిటీ షూట్ తో మరలా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. బేబీ బంప్‌తో మెరిసిపోయిన సోనారికా, ఆనందంతో నిండిన అనేక ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మొదటి బిడ్డ రాకను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు ఈ ఫోటోలు చెబుతున్నాయి. టీవీ రంగంలో ‘ పృథ్వీ వల్లభ్ ’, ‘ ఇష్క్ మే మార్జావాన్ ’, ‘ సలీం అనార్కలి ’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనారికా, ఆ తర్వాత తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి ‘జాదూగాడు’ , ‘ఈడో రకం ఆడో రకం’ వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం కుటుంబ జీవితంలో అత్యంత హ్యాపీ మోమెంట్స్‌ను ఆస్వాదిస్తున్న సోనారికా – వికాస్ దంపతులకు అభిమానులు, సహచరులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరోవైపు వారి ప్రగ్నెన్సీ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.