Sonam Kapoor | బాలీవుడ్ స్టార్ నటి, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజా జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ.. సోనమ్ కపూర్ క్రేజీగా అనౌన్స్మెంట్ చేసింది. సోనమ్ కపూర్ గురువారం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పింక్ డ్రెస్ ధరించి కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలలో సోనమ్ తన బేబీ బంప్‌ను గర్వంగా ప్రదర్శిస్తూ, ఆనందం వెదజల్లుతూ కనిపించారు. ఈ ఫోటోలకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ లుక్ దివంగత ప్రిన్సెస్ డయానా ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్‌ను పోలి ఉందంటూ ఫ్యాషన్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులకు 2022 ఆగస్టులో మొదటి కుమారుడు జన్మించగా.. అతడికి వాయు అనే పేరును పెట్టారు.