Sonakshi Sinha | హాట్ టాపిక్ గా సోనాక్షి సిన్హా రెమ్యునరేషన్..!
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న ఆచార్య, లూసిఫర్ రీమేక్ తర్వాత బాబీ సినిమా చేయనున్నాడు. హీరోయిన్ గా సోనాక్షిసిన్హా (Sonakshi Sinha ) పేరును పరిశీలిస్తుండగా..ఆమె రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ ను పూర్తి చేశాడు. ఇక త్వరలోనే మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతుందీ ప్రాజెక్టు. ఇక ఈ మూవీ పూర్తయిన తర్వాత కేఎస్ రవీంద్ర (బాబీ) (Bobby) సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ అయినట్టు టాక్ నడుస్తోంది.
చిరు-బాబీ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోనాక్షి సిన్హా రెమ్యునరేషన్ వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. చిరు సినిమా కోసం సోనాక్షి సిన్హా రూ.3.5 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. అయితే ఇది చాలా ఎక్కువ మొత్తం. కానీ హిందీలో సోనాక్షి సిన్హా పాపులర్ కావడంతో..బాబీ-చిరంజీవి సినిమాకు సోనాక్షి కూడా హెల్ప్ కావడం ఖాయం. మరి సోనాక్షి సిన్హా డిమాండ్ కు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేదా అన్న దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సోనాక్షి సిన్హా నటించిన భుజ్..ది ప్రైడ్ ఆఫ్ ఇండియా డిస్నీ +హాట్ స్టార్ లో విడుదలైంది. ఈ బ్యూటీ నటిస్తోన్న మరో ప్రాజెక్టు కకుడా చిత్రీకరణ దశలో ఉంది. చిరు మేకోవర్ లో భాగంగా ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసం వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చిరంజీవి లేటెస్ట్ తాజా లుక్ ఒకటి ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

