Sonakshi Sinha | బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ జంట ఈ నెల 23న పెళ్లిపీటలెక్కబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే తన పెళ్లి విషయం గురించి స్పందించడానికి సోనాక్షి సిన్హా నిరాకరించింది. తన తల్లిదండ్రులు కూడా పెళ్లి గురించి ఇంతలా అడగటం లేదని, సమయం వచ్చినప్పుడు తానే అన్ని విషయాలను వెల్లడిస్తానని తెలిపింది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈ జంట వివాహం నిశ్చయమైనట్లు తెలిసింది. ముంబయి శివారులోని విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. ‘డబుల్ ఎక్స్ఎల్’ చిత్రంలో ఈ జంట కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్‌లోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, గత ఏడాది కాలంగా ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల విడుదలైన ‘హీరామండీ’ సిరీస్‌తో సోనాక్షి సిన్హా మంచి విజయాన్ని దక్కించుకుంది.