రొటీన్ కథల్లో నటించి సమయాన్ని వృథా చేసుకోనని స్పష్టం చేసింది సోనాక్షిసిన్హా. తాను ఎంచుకునే పాత్రలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని, సవాళ్లతో కూడిన క్యారెక్టర్స్‌కే పెద్దపీట వేస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో బిజీగా ఉందామె. నటిగా పరిణితి సాధిస్తున్న కొద్దీ కథల ఎంపికలో కొత్తదానికి ప్రాధాన్యతనిస్తున్నానని చెప్పింది సోనాక్షిసిన్హా. ఆమె మాట్లాడుతూ ‘ప్రతి సినిమాకు ఓ కొత్త జోనర్‌ను అటెంప్ట్ చేస్తున్నా. నాకు హారర్ సినిమాలంటే అస్సలు నచ్చదు. కానీ ‘కాకుడా’అనే హారర్ కామెడీ చిత్రానికి అంగీకరించా. ఏమాత్రం పరిచయం లేని జోనర్లో ప్రయత్నిస్తేనే మన ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. ఇప్పటివరకు నేను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదు. భవిష్యత్తులో ప్రతినాయకురాలి పాత్రలో మెప్పించాలనుంది’ అని సోనాక్షి సిన్హా తెలిపింది. ఆమె త్వరలో మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్‌లో భాగం కాబోతున్నది.