Sonakshi Sinha | టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న “జటాధర” సినిమా విడుదలకు సిద్ధమైంది. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత మాజీ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ ఈ సినిమాతో తెలుగు తెరపై మళ్లీ సందడి చేయనున్నారు.ఈ చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్ నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
మూవీ ప్రమోషన్లో భాగంగా నవంబర్ 1న నిర్వహించిన ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సుధీర్ బాబు, శిల్పా శిరోద్కర్, దర్శకులు, నిర్మాతలు, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “నేను నెపో కిడ్ ని కాదు. 200 రూపాయలు కట్టి జిమ్ చేసేవాళ్లం. కృష్ణగారి అల్లుడు, మహేష్ బావగా నాకు దక్కింది ఎక్స్ట్రా కాఫీ మాత్రమే. నా తొమ్మిదినెలల కొడుకును చేతిలో పెట్టుకుని కెరీర్ గురించి ఆలోచించా. నాకు ఆకలి బాధ తెలియదు కానీ, ముద్ద దిగకపోవడం తెలుసు. కృష్ణానగర్ కష్టాలు తెలియకపోయినా, కారులో కూర్చుని ఏడవడం నాకు తెలుసు. మహేష్‌ని ఎప్పుడూ ఏ హెల్ప్ అడగలేదు అని అన్నాడు.
అదే సందర్భంగా ఆయన సహ నటీమణుల గురించి మాట్లాడుతూ .. “ఈ సినిమాలో శిల్పా గారి పెర్ఫార్మెన్స్ చూసి నేను లవ్‌లో పడ్డాను. సోనాక్షి సింహా హెల్త్ ఇష్యూల్ వల్ల ప్రమోషన్లకు రాలేదు కానీ, నిద్రపోతే కూడా ఆమె కేరెక్టర్ కలల్లోకి వస్తుంది” అన్నారు. ఇందులో సోనాక్షి లేడీ విలన్‌గా కనిపించనుండగా, ఈ పాత్ర కోసం ఏకంగా 50 కిలోల బరువైన ఆభరణాలు ధరించాల్సి వచ్చిందని తెలిపింది. తన కెరీర్లో అత్యంత శారీరక శ్రమతో కూడిన పాత్రల్లో ఒకటని.. ప్రతిరోజూ షూటింగ్‌కి సిద్ధమవ్వడానికి మూడు గంటలు పట్టేదని స్పష్టం చేసింది. చీరపై హార్నెస్ వేసుకుని, దాని మీదే ఆభరణాలు కుట్టి వేసేవాళ్లని.. అవి యాక్షన్ సన్నివేశాల్లో కదలకుండా ఉండేందుకు అలా కుట్టేవారని సోనాక్షి చెప్పుకొచ్చింది. అంత బరువైన ఆభరణాలతో గంటల తరబడి షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించినా, సినిమా కోసం చేశానంటూ ఆమె పేర్కొంది.