Ajay Devgn | బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar) అని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకువస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మొదట ఈ సినిమాను జూలై 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన చిత్రబృందం అనుకోని కారణాల వలన వారం వాయిదా వేసింది. దీంతో ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇదే రోజున టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో బాక్సాఫీస్ మధ్య ఈ రెండు సినిమాలకు పోటీ ఉండబోతుంది.
#Xclusiv… WISE DECISION – AJAY DEVGN – JIO STUDIOS TO RELEASE ‘SON OF SARDAAR 2’ ONE WEEK LATER – ON 1 AUGUST 2025… OFFICIAL STATEMENT…#SonOfSardaar2 | #AjayDevgn | #JyotiDeshpande | #JioStudios pic.twitter.com/UQhu2V6TrZ
— taran adarsh (@taran_adarsh) July 19, 2025