Sodhara Movie | వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu). ఈసారి అన్నదమ్ముల అనుబంధాన్ని కథాంశంగా తీసుకుని “సోదరా” అనే ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటూ ఏప్రిల్ 11, 2025న వేసవి సీజన్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో, క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చంద్ర చగంలా నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది. దర్శకుడు మాట్లాడుతూ.. “అన్నదమ్ముల బంధం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ఆ బంధాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు నాలుగు పాటలు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన పొందాయి. తెలుగు సినిమాల్లో సోదరుల అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రం రూపొందింది. ఈ వేసవిలో ‘సోదరా’ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాం,” అని అన్నారు.
నిర్మాత చంద్ర చగంలా మాట్లాడుతూ, “సంపూర్ణేష్ బాబు నుండి ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్తో పాటు, ఆయనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందనే ఆశాభావం ఉంది,” అని తెలిపారు. “సోదరా” ఈ వేసవిలో అన్నదమ్ముల బంధాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్తో కూడిన కొత్త అనుభవాన్ని అందించనుంది. ఏప్రిల్ 11న థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరించాలని చిత్ర బృందం కోరుతోంది.
నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను మరియు ఇతరులు.
సాంకేతిక బృందం:
కథ & దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి
నిర్మాణ సంస్థ: క్యాన్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: చంద్ర చగంలా
సంగీతం: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ: జాన్
ఎడిటింగ్: శివశర్వాణి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, పూర్ణ చారి