Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ . ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్‌పై తాజాగా ట్రోల్స్ మొదలయ్యాయి.
‘కల్కి’ ట్రైలర్ మొదలవ్వగానే ఒక ఉపగ్రహం (శాటిలైట్) కింద పడినట్లు ఒక పోస్టర్ కనిపిస్తుంది. అయితే ఈ పోస్టర్ కాపీ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్ చోయ్ (Sung Choi) డిజైన్ చేసిన శాటిలైట్ ఆర్ట్‌ని కల్కి మూవీలో వాడినట్లు తెలుస్తుంది. ఇక సంగ్ చోయ్ చేసిన ఈ డిజైన్ 10 ఏండ్ల క్రితంది అని సమాచారం. దీంతో నెటిజన్లు కల్కి మూవీ కాపీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయమని స్వప్న దత్ కూడా ఇన్‌స్టాలో కామెంట్ పెట్టింది. కాగా ఈ కామెంట్స్‌పై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
Kalki 2898 AD makers copied this from artist Sung Choi. He’s calling them out now.
If it is true than this is very shameful and disappointing. Makers should have at least reach out to the artist and should have given him the credits. #Kalki2898AD pic.twitter.com/2yprX5KHwB
— Mojj❄ (@mojj246) June 13, 2024