Salaar | తన కొత్త సినిమా ‘సలార్’ను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నారు. విడుదల తేదీని టార్గెట్ చేసి షూటింగ్లో వేగం పెంచారట. చిత్రీకరణతో పాటు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ‘సలార్’ రాత్రి షూటింగ్‌కు సంబంధించిన ఫొటో ఒకటి చిత్ర సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
చిత్ర మేకింగ్‌లో ఎంత భారీతనం ఉందో ఈ ఫొటో ద్వారా తెలుస్తున్నది. ఈ ఫారిన్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ తుది అంకానికి చేరుకున్నట్లేనని తెలుస్తున్నది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నారు.