Sobhita Dhulipala | అక్కినేని కోడలు, టాలీవుడ్ నటి శోభితా ధూళిపాళ తన అప్‌కమింగ్ మూవీ సెట్స్‌లో వంట చేసింది. తాను వంట చేసిన ఫొటోలను ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పంచుకుంది. అయితే ఈ ఫొటోలకు శోభితా భర్త నటుడు నాగచైతన్య స్పందిస్తూ.. ఆ వంటను రుచి చూడాలని ఉందంటూ చైతూ కామెంట్ చేశాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘మేడ్ ఇన్ హెవెన్’, ‘ది నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్‌లతో మంచి పేరు సంపాదించుకుంది శోభితా. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక స్టార్ నటుడి ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం.