Naga Chaitanya – Sobhita Dhulipala | టాలీవుడ్ క్రేజీ జంట నాగ చైతన్య, శోభిత ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. సమంత నుండి విడిపోయాక శోభితని వివాహం చేసుకున్న నాగ చైతన్య ఇప్పుడు ఆమెతో సంతోషంగానే ఉన్నాడు. శోభిత వచ్చినప్పటి నుండి చైతూ జీవితంలో అంతా మంచే జరుగుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శోభితతో వివాహం తర్వాత నాగ చైతన్య తండేల్ వంటి సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్నారు. ఇక ఆ సక్సెస్ ఎంజాయ్ చేసేందుకు నాగచైతన్య, శోభిత కలిసి యూరప్ ట్రిప్ వెళ్లారు. ఆ ఫోటోలను ఇన్ స్టాలో పంచుకున్నారు చైతూ.
ఇక రీసెంట్గా శోభిత పెట్ డాగ్ హాష్‌తో ఆడుకోవడం, తమ సన్ డే ఇలా గడిచిందంటూ పలు ఫోటోలు షేర్ చేయడం చూస్తే నాగ చైతన్య, శోభితలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అర్ధమవుతుంది. నాగచైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు శోభిత గర్భవతి అని త్వరలో పండంటి బేబికి జన్మనివ్వబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. ఫాన్స్ అయితే అక్కినేని ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. దీనిపై నాగచైతన్య నుంచి కానీ శోభిత నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అక్కినేని ఫ్యామిలీ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు.
కాని ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని , శోభిత ప్రెగ్నెంట్ కాదని అంటున్నారు. కాగా, రీసెంట్గా శోభిత.. హాష్ డాగ్‌తో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా ,దానికి కొందరు నెటిజన్స్ నాగ చైతన్య, శోభితలు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనే.. రూమర్‌ను పుట్టించారు. అందుకే ఈ ఫోటోలు షేర్ చేశారని కామెంట్స్ చేశారు. ఇక చైతూ తండేల్ సక్సెస్ తర్వాత ‘విరూపాక్ష’ ఫేం కార్తిక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు.