Sobhita Dhulipala | అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ జంట ఈ నెల 4న వివాహంతో ఒకటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో కొద్దిమంది బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం శోభితకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్‌గా మారింది. పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న శోభిత పాటకు స్టెప్పులేసింది. అల్లు అర్జున్ ‘సరైనోడు’ చిత్రంలోని ‘బ్లాక్ బస్టర్’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఈ సందర్భంగా శ్రద్ధా నాకు పెళ్లవుతోంది.. నాకు సిగ్గేస్తోందంటూ.. అదే సమయంలో ఈ పాట ప్లే కావడంతో శోభిత స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోను చూసిన పలువురు శోభితను ప్రశంసించారు. పెళ్లిని బాగా ఎంజాయ్ చేశారని.. సంతోషంగా కనిపిస్తున్నారని పలువురు కామెంట్స్ చేయగా.. సింప్లీ సూపర్బ్ డ్యాన్స్ అంటూ మరికొందరు స్పందించారు. సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శోభితతో రిలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. పెద్దగా సందడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.
This video of #SobhitaDhulipala proves happiest brides are the prettiest #NagaChaitanya #viralvideo #GalattaIndia pic.twitter.com/9MUHLG0K35
— Galatta India (@galattaindia) December 10, 2024