Sneha reddy – Atlathaddi | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ సోషల్ మీడియా సెలబ్రిటీగా గుర్తింపు సంపాదించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫ్యామిలీ, పిల్లల ఫోటోలు, వీడియోలు, వెకేషన్స్.. అన్నిటి గురించి షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో బన్నీ అభిమానులు అంతా స్నేహని కూడా ఫాలో అవుతారు. అయితే ఈ భామ ప్రతి పండగను ఘనంగా జరుపుకుంటుంది. సంక్రాంతి, ఉగాది, వరలక్ష్మి వ్రతం ఇలా ఏ పండుగైన అచ్చ తెలుగింటి ఆడపిల్లలా సాంప్రదాయ చీరకట్టులో కనిపిస్తుంది. ఈ భామ తాజాగా తన భర్త అల్లు అర్జున్ బాగుండాలని అట్లతద్ది నోము చేసుకుంది.
నేడు అట్ల తద్ది పండుగన్న విషయం తెలిసిందే. పెళ్లి కానీ అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని ఈ నోము ఆచరించగా.. పెళ్లి అయిన స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ నోము చేసుకుంటారు. నార్త్‌లో ఇదే పండుగను కర్వా చౌత్ పేరుతో పిలుస్తారు. అయితే, తాజాగా స్నేహ రెడ్డి కూడా తన భర్త అల్లు అర్జున్ బాగుండాలని అట్లతద్ది నోము చేసుకుంది. ఎర్ర చీరలో అందంగా ముస్తాబై తెలుగింటి ఆడపిల్లలా ఉన్న ఆమె పూజ చేసిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.