సంజయ్రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. మైక్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. ఈ నెల 21న విడుదల కానుంది. సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోమవారం నటుడు సత్యదేవ్ విడుదల చేశారు. దర్శకుడు మట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. మనుషుల కంటే జంతువులే విధేయంగా ఉంటాయి. ఈ పాయిం ట్ ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నా. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు.
ఈ సినిమాలో తాను మాస్ పాత్రలో కనిపిస్తానని హీరో సంజయ్రావు తెలిపారు. ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచే కంటెంట్‌తో ఈ సినిమాను రూపొందించామని మైక్ టీవీ సీఈవో చక్రధర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రచన-దర్శకత్వం: ఏఆర్ శ్రీధర్.