మురళీకృష్ణంరాజు, శృతిశెట్టి జంటగా నటించిన పొయెటిక్ లవ్‌స్టోరీ ‘స్కై’. నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మీ గుంటక, మురళీకృష్ణంరాజులతో కలిసి పృథ్వీ పెరిచెర్ల స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై’ పేరిట ఓ టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ‘మేమంతా ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేయగలిగాం.
ఆడియన్స్‌కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలమన్న నమ్మకం ఉంది.’ అని దర్శక, నిర్మాత పృథ్వీ పెరిచెర్ల అన్నారు. ఇంకా హీరో, నిర్మాత మురళీకృష్ణంరాజు, డీవోపీ రసూల్ ఎల్లోర్ కూడా మాట్లాడారు. ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టార్, ఎంఎస్, కేఎల్కే మణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శివప్రసాద్, నిర్మాణం: వాలోర్ ఎంటైర్టెన్మెంట్ స్టూడియోస్.