Skandha Trailer | రామ్-బోయపాటి (Ram Boyapati) కాంబినేషన్లో వస్తున్న స్కంద (Skandha) సినిమాపై సినీ లవర్స్‌లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ మధ్య రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ మామూలు ఎక్స్పెక్టేషన్స్ పెంచలేదు. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి పూర్తవుతూ వస్తున్నాయి. ఇక మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్ల క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
స్కంద థియేట్రికల్ ట్రైలర్‌ని ఆగష్టు 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ప్రీ రిలీజ్ థండర్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ ట్రైలర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం స్కంద పై హైప్ భారీగా పెరుగుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
An Electrifying Celebration of Mass with boundless energy💥#SkandaPreReleaseThunder ⚡️ on August 26th ❤️🔥#SkandaOnSep15 #RAPOMass
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/bp8OAzpvtl— Srinivasaa Silver Screen (@SS_Screens) August 24, 2023