Skanda Movie Trailer | రామ్-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న స్కంద సినిమాపై సినీ లవర్స్‌లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. పైగా ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ మామూలు ఎక్స్పెక్టేషన్స్ పెంచలేదు. బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు గ్లింప్స్‌తోనే స్పష్టమైపోయింది. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి పూర్తవుతూ వస్తున్నాయి. ఇక శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పెద్ద ఎత్తులో నిర్వహిస్తున్నారు. ఈ వేడకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నాడు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను రాత్రి 9:09 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతుందట. ఇన్సైడ్ లెక్కల ప్రకారం ఒక్క తెలుగులోనే ఈ సినిమాకు రూ.40 కోట్ల రేంజ్లో డీల్‌ను కుదిరించుకున్నారట. ఇక ఓవర్సీస్ సహా మిగితా అన్ని భాషలు కలిపి మరో పది, పదేహను కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగే చాన్స్ ఉందట. రామ్ కెరీర్లో ఇదే అత్యధికం. ఈ సినిమాతో రామ్‌కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వస్తుందని చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు.
#SkandaTrailer TODAY @ 9:09PM.. Watch it on the BIGGEST Screen possible! 🔥 pic.twitter.com/WuIt8Ziueu
— RAm POthineni (@ramsayz) August 26, 2023