Skanda| టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni) నటిస్తోన్న తాజా చిత్రం స్కంద (Skanda). బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. RAPO20గా వస్తోన్న ఈ మూవీ నుంచి నీ చుట్టూ చుట్టూ పాటను లాంఛ్ చేయగా.. నెట్టింటిని షేక్ చేస్తోంది. తాజాగా గండరబాయ్ (Gandarabai Lyrical Video) అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.
గండరబాయ్ గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్.. గండరబాయ్ గండరబాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మయ్ అంటూ సాగే ఈ సాంగ్‌ను అనంత్ శ్రీరామ్ రాశారు. ఎస్ థమన్ కంపోజిషన్‌లో నకాశ్ అజీజ్, సౌజన్య భాగవతుల పాడారు. ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజిషన్‌లో రామ్, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులేసి బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేయడం ఖాయమని విజువల్స్ చెబుతున్నాయి. ఈ పాటను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
బోయపాటి టీం ఇప్పటికే విడుదల చేసిన స్కంద పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్. RAPO20 చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
అఖండ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రామ్ ఓ గుడి ముందు భారీ దున్నపోతు ముక్కుతాడు పట్టుకొని వస్తున్న స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
గండరబాయ్ సాంగ్..
నీ చుట్టూ చుట్టూ సాంగ్..
స్కంద టైటిల్ గ్లింప్స్..