Skanda | బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం స్కంద (Skanda). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా RAPO20గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. నీ చుట్టూ చుట్టూ పాట ప్రోమోను రేపు ఉదయం 10:26 గంటలకు, ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను ఆగస్టు 3న ఉదయం 9:36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ.. కొత్త లుక్ విడుదల చేశారు.
రామ్, శ్రీలీల కాంబోలో వచ్చే ఈ సాంగ్ కలర్ఫుల్గా విజువల్ ట్రీట్ అందించేలా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. ఈ పాటను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు. స్కంద చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రామ్- బోయపాటి టీం. RAPO20 చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అఖండ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రామ్ ఓ గుడి ముందు భారీ దున్నపోతు ముక్కుతాడు పట్టుకొని వస్తున్న స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఫస్ట్ సింగిల్ ప్రోమో లుక్..
A Rhythm for the Energetic Vibe!🕺💃#Skanda first single #NeeChuttuChuttu – #MainPeechePeeche – #OnaSuthiSuthi – #NinSutthaSuttha – #NeeThottuThotta promo tomorrow at 10:26AM, full song on AUG 3rd at 9:36AM🔥
A @MusicThaman Vibe🥁💥#SkandaonSep15
Ustaad @ramsayz… pic.twitter.com/ANHFOcaM8Z
— Ramesh Bala (@rameshlaus) July 31, 2023
స్కంద టైటిల్ గ్లింప్స్..