తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ ఫేవరేట్ సూపర్ హిట్ చిత్రాలకు కొదవేమీ లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు చూసినా అప్పుడే విడుదలైన సినిమాలాగా ఫ్రెష్ ఫీల్ అందించేవి కొన్ని ఉంటాయి. అలాంటి మూవీస్ జాబితాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఖుషి టాప్‌లో ఉంటుంది. 2001లో ఎస్జే సూర్య డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఈ బ్లాక్ బస్టర్ సినిమా డిసెంబర్ 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఖుషి (Kushi) రీరిలీజ్‌కు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ విడుదలవుతున్న నేపథ్యంలో ఎస్జే సూర్య ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు. సినిమా అంతా పవన్ కల్యాణ్ అద్భుతమైన ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసేలా ఉంటుందని చెప్పాడు.
ఖుషి లాంటి లవ్ ట్రాక్‌తో సాగే సబ్జెక్టులో యే మేరా జహా సాంగ్ లాంటి సామాజిక బాధ్యతతో కూడిన పాటను పెట్టడం పవన్ కల్యాణ్‌కు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనం. అంతేకాదు సినిమాలో వచ్చే కొన్ని సంభాషణలు, సమస్యలు పవన్ కల్యాణ్ సోషల్ రెస్పాన్సిబులిటీని తెలియజేస్తాయన్నాడు. భూమిక ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.
యే మేరా జహా సాంగ్ స్టిల్..