‘ఖుషి’ సినిమాతో దర్శకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్.జె.సూర్య. 2015లో స్వీయ దర్శకత్వంలో తాను నిర్మించి, నటించిన ‘ఇసై’ చిత్రం పరాజయం కావడంతో దర్శకత్వానికి దూరమై, నటనకు దగ్గరయ్యారాయన. ఇదిలావుంటే.. త్వరలో మళ్లీ ఎస్.జె.సూర్య మెగా ఫోన్ పట్టనున్నారట. ‘కిల్లర్’ అనే కథను కూడా సిద్ధం చేసుకున్నారట.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. శంకర్ ‘గేమ్ చేంజర్’ తర్వాత తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం దర్శకుడిగా అప్డేట్ అయ్యే పనిలో ఉన్నానని, నా ైస్టెల్లోనే సినిమాలు తీయాలని నేను అనుకోనని, ప్రస్తుతం నటుడిగా ఇతర దర్శకుల ైస్టెల్‌ని పరిశీలిస్తున్నానని, త్వరలో తీయబోయే సినిమా తన శైలికి భిన్నంగా ఉంటుందని సూర్య తెలిపారు.